ట్రెండింగ్
Epaper    English    தமிழ்

SSMB 28 నా డ్రీం ప్రాజెక్ట్ - SS థమన్

cinema |  Suryaa Desk  | Published : Thu, Feb 02, 2023, 04:14 PM

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారి కలయికలో మూడవ సినిమా (SSMB 28) రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ ఎనౌన్స్మెంట్ జరిగినప్పటి నుండి అభిమానుల్లో అంచనాలు ఏర్పడ్డాయి. ఆపై మహేష్ స్టైలిష్ మేకోవర్ తో అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ సినిమాలో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు.


తాజాగా జరిగిన ఒక మీడియా ఇంటిరాక్షన్ లో థమన్ మాట్లాడుతూ.. ఈ సినిమాకు పని చెయ్యడం తన డ్రీం అని, మహేష్ - త్రివిక్రమ్ గారి కాంబినేషన్ లో పని చెయ్యడం నిజంగా కల సాకారం చేసుకోవడం అని, ఇందుకోసం నా ప్రాణం పెట్టి పనిచేస్తున్నా.. అని చెప్పుకొచ్చారు.


ప్రస్తుతం SSMB 28 షూటింగ్ హైదరాబాద్ అమీర్ పేట పరిసర ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతుంది. ఈ షెడ్యూల్ లో మహేష్ పలు కీలక యాక్షన్ సన్నివేశాలలో నటిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa