బాలీవుడ్ ప్రేమపక్షులు కియారా అద్వానీ, సిద్దార్ద్ మల్హోత్రా త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారంటూ గట్టి టాక్ వినిపిస్తుంది. మరో నాలుగు రోజుల్లోనే వీరిరుద్దరు పెళ్లితో ఒకటి కాబోతున్నారట. ఈ నెల 6న రాజస్థాన్ జైసల్మేర్‌లోని సూర్యగఢ్ ప్యాలెస్‌లో కియారా, సిద్దార్ద్ పెళ్లి చేసుకోబోతున్నారు. 4, 5 తేదీల్లో మెహందీ, హల్దీ, సంగీత్ ఈవెంట్స్ జరగనున్నాయి అంటూ బాలీవుడ్ మీడియాలో జోరుగా వార్తలు వస్తున్నాయి.