వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. ప్రాజెక్ట్ కే విషయంలో షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కథ పరిధి చాలా పెద్దగా ఉండడంతో ఒకే సినిమాలో అదంతా ఇమడ్చడం కష్టమని, రెండు భాగాలుగా విడుదల చేస్తే బాగుంటుందని దర్శకుడు నాగ్ అశ్విన్ భావిస్తున్నాడట. ఈవిషయం ప్రభాస్‌తో చర్చించగా ఆయన కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. అయితే ఈ విషయంపై చిత్రం బృందం నుంచి అధికారిక సమాచారం లేదు.