మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఈ ఏడాది 'ధమ్కీ' చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతున్న విషయం తెలిసిందే. మహాశివరాత్రి కానుకగా ఫిబ్రవరి 17న తెలుగు, హిందీ, మలయాళం, తమిళ భాషలలో ఈ సినిమా విడుదల కావడానికి రెడీ అవుతుంది. అయితే, తాజా సమాచారం ప్రకారం, షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవడంతో ధమ్కీ మూవీ షెడ్యూల్ రిలీజ్ టైం కు థియేటర్లకు రావట్లేదని తెలుస్తుంది. మరి, ఈ విషయంపై మేకర్స్ నుండి అఫీషియల్ కన్ఫర్మేషన్ రావలసి ఉంది.
ఈ సినిమాకు విశ్వక్ సేన్ దర్శకుడిగా కూడా వ్యవహరిస్తున్నారు. నివేద పేతురాజ్ హీరోయిన్ గా నటిస్తుంది. లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నారు. వణ్మయి క్రియేషన్స్, VS సంయుక్త బ్యానర్లు నిర్మిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa