ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'తలపతి 67' – క్యారెక్టర్ ఆర్టిస్టుల వివరాలు

cinema |  Suryaa Desk  | Published : Wed, Feb 01, 2023, 05:21 PM

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కానగరాజ్ తన తదుపరి సినిమాని తలపతి విజయ్ తో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో విజయ్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నట్లు సమాచారం. తాజాగా ఇప్పడు మూవీ మేకర్స్ తమ సోషల్ మీడియా ప్రొఫైల్‌ ద్వారా ఈ సినిమాలోని క్యారెక్టర్ ఆర్టిస్టుల వివరాలను వెల్లడించింది. ఈ చిత్రంలో ప్రియా ఆనంద్, సంజయ్ దత్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మిస్కిన్, యాక్షన్ కింగ్ అర్జున్, మాథ్యూ థామస్, మన్సూర్ అలీ ఖాన్ మరియు డ్యాన్స్ మాస్టర్ శాండీ కీలక పాత్రలు పోషిస్తారని ప్రకటించారు.

విజయ్ సరసన ఈ సినిమాలో త్రిష జోడిగా నటిస్తుంది. ఈ ఏడాది దసరాకి సినిమాను విడుదల చేసేందుకు మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించనున్నారు. ఈ చిత్రాన్ని సెవెన్ స్క్రీన్ స్టూడియో భారీ స్థాయిలో నిర్మించనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa