కొద్దిసేపటి క్రితమే 'శశివదనే' మూవీ నుండి టైటిల్ సాంగ్ లిరికల్ వీడియో విడుదలైంది. డాషింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ శశివదనే టైటిల్ లిరికల్ వీడియోను విడుదల చేసి, చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. బ్యూటిఫుల్ లవ్ మెలోడీగా, మెస్మరైజింగ్ మ్యూజిక్ తో ఈ పాట యువతను ఇట్టే ఆకర్షించే విధంగా ఉంది. శరవణ వాసుదేవన్ స్వరపరిచిన ఈ విలేజ్ మెలోడీని హరిచరణ్, చిన్మయీ శ్రీపాద ఆలపించారు. కిట్టు విస్సాప్రగడ లిరిక్స్ అందించారు.
సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వంలో అందమైన విలేజ్ లవ్ స్టోరీ గా రూపొందుతున్న ఈ సినిమాలో రక్షిత్ అట్లూరి, కోమలీ ప్రసాద్ జంటగా నటించారు. అహితేజ నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa