ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'శాకుంతలం' విడుదల వాయిదా పడనుందా?

cinema |  Suryaa Desk  | Published : Wed, Feb 01, 2023, 04:29 PM

గుణశేఖర్ దర్శకత్వంలో సౌత్ ఇండియా స్టార్ బ్యూటీ సమంత 'శకుంతలం' సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ పాన్-ఇండియన్ పీరియాడికల్ డ్రామా ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 17న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో 3డిలో థియేటర్లలోకి రానుంది. అయితే ఇప్పుడు టాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్స్‌లో లేటెస్ట్ బజ్ ప్రకారం, ఈ సినిమా అనుకున్న తేదీకి పెద్ద స్క్రీన్‌లలోకి రాకపోవచ్చు అని లేటెస్ట్ టాక్. ఈ సినిమాకు ఇతర భాషల్లో థియేటర్ల సమస్యలు ఎదురవుతున్నాయని, దీంతో చిత్రబృందం విడుదలను వాయిదా వేయాల్సి వస్తోందని బజ్. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో ప్రొడక్షన్ హౌస్ నుండి వచ్చే అవకాశం ఉంది.

ఈ చిత్రంలో దేవ్ మోహన్ దుష్యంత పాత్రలో నటిస్తుండగా, అల్లు అర్జున్ కూతురు అర్హ ఈ చిత్రంలో ప్రిన్స్ భరతుడిగా కనిపించనుంది. కాళిదాసు రచించిన అభిజ్ఞానం శాకుంతలం నాటకం ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో మోహన్ బాబు  దుర్వాస పాత్రలలో నటించారు. ఈ చిత్రంలో అదితి బాలన్, ప్రకాష్ రాజ్, అనన్య నాగళ్ల, గౌతమి, కబీర్ బేడీ, మధుబాల, కబీర్ దుహన్ సింగ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మణిశర్మ ఈ సినిమాకి సంగీతం అందించాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa