యంగ్ అండ్ బ్యూటిఫుల్ అవికాగోర్ నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం "పాప్ కార్న్". ఇందులో సాయి రోనక్ హీరోగా నటిస్తుండగా, మురళీ నాగ శ్రీనివాస్ గంధం దర్శకత్వం చేస్తున్నారు. శ్రీజో సంగీతం అందిస్తున్నారు. పోతే, ఈ మూవీ ఫిబ్రవరి 10వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతుంది.
విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్స్ ముమ్మరం చేసింది. ఈ సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మను పాప్ కార్న్ చిత్రబృందం దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేసారు. ఇందుకు సంబంధించిన పిక్స్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa