పెళ్లిచూపులు, ఈ నగరానికి ఏమైంది చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లో చాలా మంచి క్రేజ్ సంపాదించుకున్నారు డైరెక్టర్ తరుణ్ భాస్కర్. కొన్నాళ్ళబట్టి తనలోని రచయితను, నటుడిని చూపిస్తూ ప్రేక్షకులను అలరించిన తరుణ్ భాస్కర్ మళ్ళీ తనకిష్టమైన డైరెక్షన్ డిపార్ట్మెంట్ కే వచ్చేసారు. ఆయన డైరెక్షన్లో తాజాగా రూపొందుతున్న చిత్రం "కీడా కోలా".
తాజాగా ఈ రోజు కీడా కోలా సినిమా నుండి మేకర్స్ బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఈ రోజు బ్రహ్మానందం పుట్టినరోజు సందర్భంగా, ఆయన క్యారెక్టర్ ని పరిచయం చేస్తూ స్పెషల్ పోస్టర్ విడుదల చేసారు. ఇందులో వరదరాజులు అనే వయసుమళ్లిన పాత్రలో బ్రహ్మానందం గారు నటిస్తున్నారు.
వీజీ సైన్మా బ్యానర్ లో ప్రొడక్షన్ నెంబర్ 1 గా తెరకెక్కబోతున్న ఈ మూవీలో శ్రీపాద్ నందిరాజ్, సాయికృష్ణ గద్వాల్, ఉపేంద్ర వర్మ, వివేక్, కౌశిక్ నండూరి నిర్మిస్తున్న కీడా కోలా ఈఏడాదిలోనే పాన్ ఇండియా రిలీజ్ కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa