ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ఖుషి' కి సంబంధించిన కీలక అప్‌డేట్‌ని వెల్లడించిన దర్శకుడు శివ

cinema |  Suryaa Desk  | Published : Mon, Jan 30, 2023, 05:30 PM

టాలీవుడ్ యంగ్ అండ్ సేనాషనల్ హీరో విజయ్ దేవరకొండ శివ నిర్వాణ దర్శకత్వంలో ఒక సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన గ్లామర్ బ్యూటీ సమంతా రూత్ ప్రభు జంటగా కనిపించనుంది. మూవీ మేకర్స్ ఈ రొమాంటిక్ లవ్ స్టోరీకి 'ఖుషి' అనే టైటిల్ ని లాక్ చేసారు.

సమంతా మయోసైటిస్ అనే అరుదైన ఆటో ఇమ్యూన్ వ్యాధితో బాధపడుతుండటంతో ఆమె షూటింగ్‌లకు విరామం తీసుకుంది. అప్పటి నుండి, ఈ సినిమా గురించి అనేక పుకార్లు ఆన్‌లైన్‌లో వెలువడుతున్నాయి. కాబట్టి ఆ పుకార్లకు చెక్ పెట్టడానికి చిత్ర దర్శకుడు శివ నిర్వాణ ట్విట్టర్‌లో సమాధానమిచ్చారు. ఈ సినిమా షూటింగ్ త్వరలో తిరిగి ప్రారంభమవుతుందని, అంత బాగుంటుందని రాశారు.


ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ట్రాక్ లో రానున్న ఈ సినిమాలో సచిన్ ఖేడాకర్, మురళీ శర్మ, లక్ష్మి, అలీ, రోహిణి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. హృదయం ఫేమ్ హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa