నందమూరి తారకరత్నకు బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. సోమవారం నందమూరి రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై అప్ డేట్ ఇచ్చారు. తారకరత్న కోలుకుంటున్నాడని, సొంతంగా ఊపిరి పీల్చుకుంటున్నాడని చెప్పారు. సిటీ స్కాన్ రిపోర్టు వచ్చాక బ్రెయిన్ పనితీరుపై క్లారిటీ వస్తుందని, ఎక్మో అసలు పెట్టలేదని చెప్పారు. తారకరత్న పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోందని తెలిపారు.