SS రాజమౌళి డైరెక్షన్ లో టాలీవుడ్ స్టార్ హీరోస్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'RRR' సినిమా థియేటర్లలో విడుదలై సంచలనం సృష్టించింది. తాజాగా ఈ సినిమాను జపాన్‌లో అక్టోబర్ 21న విడుదల చేయగా 100 రోజులు పూర్తి చేసుకుని ఇప్పటికీ 114 జపాన్ థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతోంది. ఒక సినిమా 114 థియేటర్లలో ఏకంగా 100 రోజులు రన్ అవడం ఈ రోజుల్లో గొప్ప ఫీట్.
ప్రస్తుతం జపాన్ అంతటా RRR ప్రదర్శించబడుతున్న 114 థియేటర్ల లిస్ట్ ను కలిగి ఉన్న పోస్టర్‌తో పాటు జపాన్ ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుతూ రాజమౌళి ఈ వార్తను పంచుకున్నారు. RRR ఇటీవల 1998లో JPY400 మిలియన్ (రూ 22 కోట్లు) వసూలు చేసిన రజనీకాంత్ నటించిన ముత్తు యొక్క రికార్డును అధిగమించింది. ఇప్పటి వరకు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద JPY650 మిలియన్లను ($5 మిలియన్లు) సాధించింది.
ఈ యాక్షన్ డ్రామా మూవీలో అలియా భట్, సముద్రఖని, అజయ్ దేవగన్, శ్రియా శరణ్, ఒలివియా మోరిస్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని డివివి దానయ్య భారీ స్థాయిలో నిర్మించారు. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa