బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్, గ్లామరస్ బ్యూటీ దీపికా పదుకొణె జంటగా నటిస్తున్న నాల్గవ చిత్రం "పఠాన్". సిద్దార్థ్ ఆనంద్ డైరెక్షన్లో ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో జాన్ అబ్రహం విలన్గా నటిస్తున్నారు. హిందీ, తెలుగు, తమిళ భాషలలో ఈ రోజే పఠాన్ ప్రేక్షకులను పలకరించడానికి థియేటర్లకు వచ్చాడు.
తాజా సమాచారం ప్రకారం, పాండెమిక్ కారణంగా మూతపడిన 25 థియేటర్లు పఠాన్ రాకతో తిరిగి ప్రారంభం అవుతున్నాయట. ఈ మేరకు పునఃప్రారంభం అవుతున్న థియేటర్ల పేర్లను పేర్కొంటూ, షారుఖ్ ఖాన్ ట్వీట్ చేసారు. ఈ సందర్భంగా వారందరికీ శుభాకాంక్షలను తెలియచేసారు. వారికీ అలానే తనకు కూడా గ్రాండ్ సక్సెస్ రావాలని ప్రార్ధిస్తున్నట్టు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa