అఖండ, వీరసింహారెడ్డి బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్స్ తో నటసింహం నందమూరి బాలకృష్ణ గారు ప్రస్తుతం ఫుల్ సక్సెస్ జోష్ లో ఉన్నారు. VRS రిలీజ్ కి ముందే NBK 108 ని పట్టాలెక్కించిన బాలయ్య అతి త్వరలోనే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ చెయ్యబోతున్నారు.
ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా ఎవరు నటించబోతున్నారనే విషయంపై మేకర్స్ నుండి ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. అంజలి, ప్రియమణి, సోనాక్షి సిన్హా.. ఇలా చాలామంది హీరోయిన్ల పేర్లు వినిపించగా, తాజాగా టాలీవుడ్ చందమామ ఈ లిస్ట్ లో జాయిన్ అయ్యింది. ప్రస్తుతం ఇండియన్ 2 షూటింగ్ లో పాల్గొంటున్న కాజల్ తన డేట్స్ ను అడ్జస్ట్ చేసుకోగలిగితే, NBK 108లో బాలయ్యకు జోడిగా నటించే అవకాశం ఉందని ప్రజెంట్ ఇండస్ట్రీ లో టాక్ నడుస్తుంది. మరి, ఈ విషయంలో నిజమెంతుందో తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa