ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'తలపతి 67' లో అతిధి పాత్రలో కమల్ హాసన్?

cinema |  Suryaa Desk  | Published : Tue, Jan 24, 2023, 03:20 PM

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కానగరాజ్ తన తదుపరి సినిమాని తలపతి విజయ్ తో చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ బజ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో బహుముఖ నటుడు కమల్ హాసన్ అతిధి పాత్రలో నటించే అవకాశం ఉంది అని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం గురించి మూవీ మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఈ చిత్రంలో విజయ్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించనున్నారు. ఈ చిత్రాన్ని సెవెన్ స్క్రీన్ స్టూడియో భారీ స్థాయిలో నిర్మించనుంది. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు మూవీ మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నార .






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa