టాలీవుడ్ లో విషాదం మరో యువ నటుడు కన్నుమూత. యువ హీరో సుధీర్ వర్మ ఆత్మహత్య చేసుకున్నాడు. 'కుందనపు బొమ్మ' సినిమాలో సుధీర్ వర్మ సెకండ్ హీరోగా నటించాడు. ఆ తరువాత సూపర్ హిట్టయిన షూటవుట్ ఎట్ ఆలేరు వెబ్ సిరీస్ లో కూడా అతను నటించాడు.కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన సెకండ్ హ్యాండ్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు సుధీర్. ఆ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత కుందనపు బొమ్మ సినిమాలో నటించాడు. ఈరోజు విశాఖపట్నంలోని తన నివాసంలో సుధీర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.సుధీర్ వర్మ ఆత్మహత్యకు గల అసలు కారణం ప్రస్తుతం తెలియరాలేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa