టీమిండియా క్రికెటర్ KL రాహుల్, బాలీవుడ్ సీనియర్ నటుడు సునీల్ శెట్టి గారాలపట్టి అతియా శెట్టిల రిలేషన్ షిప్ పై ఎప్పటినుండో మీడియాలో ఊహాగానాలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరి రిలేషన్ అతి త్వరలోనే వివాహంగా మారబోతుందని కూడా కొద్దిరోజుల నుండి మీడియాలో ప్రచారం మరింత ఎక్కువైంది.
తాజా సమాచారం ప్రకారం, లోనావాలాలో వీరిద్దరి వివాహం కుటుంబ సభ్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగిందని తెలుస్తుంది. ఈ సందర్భంగా సునీల్ శెట్టి, ఆయన కుమారుడు ఆహాన్ శెట్టి పెళ్లి మండపం బయట ఉన్న మీడియా మిత్రులకు మిఠాయిలు పంచి, నూతన దంపతులను ఆశీర్వదించమని కోరారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.