డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తమ్ముడు సాయిరాం శంకర్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "వెయ్ దరువెయ్". ఇందులో యషా శివకుమార్ హీరోయిన్ గా నటిస్తుంది. నవీన్ రెడ్డి డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న ఈ సినిమాను శంకర్ పిక్చర్స్ పతాకంపై దేవరాజ్ నిర్మిస్తున్నారు. భీమ్స్ సంగీతం అందిస్తున్నారు. పక్కా మాస్ మసాలా ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.
రీసెంట్గానే ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ 'మంజుల మంజుల' స్పెషల్ సాంగ్ విడుదలై శ్రోతలను అలరించగా, తాజాగా వెయ్ దరువెయ్ టైటిల్ ట్రాక్ ను వీడియో రూపంలో విడుదలయ్యింది. రాహుల్ సిప్లిగంజ్ ఆలపించిన ఈ పాటకు సురేష్ గంగుల సాహిత్యం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa