మెగాపవర్ స్టార్ రాంచరణ్ తేజ్ కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్లో ఒక చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇంకా టైటిల్ ఖరారు కాబడని ఈ సినిమాRC 15 వర్కింగ్ టైటిల్ తో పేర్కొనబడుతుంది. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు.
తాజా బజ్ ప్రకారం, ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో, రియల్ స్టార్ ఉపేంద్ర గారు కీరోల్ లో నటించబోతున్నట్టు టాక్ నడుస్తుంది. త్రివిక్రం - అల్లు అర్జున్ కలయికలో వచ్చిన "సన్నాఫ్ సత్యమూర్తి" సినిమాలో ఉపేంద్ర గారు విలన్గా నటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు RC 15లో చరణ్ కి గురువుగా ఉపేంద్ర గారు నటిస్తున్నారని టాక్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa