గోపీచంద్ మలినేని డైరెక్షన్లో నటసింహం నందమూరి బాలకృష్ణ గారు నటించిన చిత్రం "వీరసింహారెడ్డి". సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకాభిమానులు నీరాజనాలు పలుకుతున్నారు. దీంతో ఈ సినిమా బాలయ్య కెరీర్ లో బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచింది.
ఈ సందర్భంగా వీరసింహుని విజయోత్సవ వేడుకల పేరిట నిన్న సాయంత్రం హైదరాబాద్ లో మేకర్స్ సక్సెస్ సెలెబ్రేషన్స్ నిర్వహించారు. చిత్రబృందంతో పాటుగా యంగ్ హీరోలు సిద్ధూ జొన్నలగడ్డ, విశ్వక్ సేన్, అనిల్ రావిపూడి..తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు.
ఈ చిత్రంతోనే టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది మోస్ట్ బ్యూటిఫుల్ మలయాళ కుట్టి హనీ రోజ్. వీరసింహుని విజయోత్సవ వేడుకలలో బాలయ్య, హనీ రోజ్ ఒకరొకొకరు వైన్ తాగించుకుంటున్న పిక్ ఒకటి మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa