లెజెండరీ నటుడు కమల్ హాసన్ మరొక లెజెండరీ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో దాదాపు 36 ఏళ్ళ తదుపరి ఒక సినిమాలో నటించబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో మద్రాస్ టాకీస్, రాజ్ కమల్ ఇంటర్నేషనల్ మూవీస్, రెడ్ జైంట్ మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. AR రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.
ఈ క్రేజీ మూవీ పై సోషల్ మీడియాలో ఎక్జయిటింగ్ న్యూస్ ఒకటి హల్చల్ చేస్తుంది. అదేంటంటే, ఈ సినిమాలో పలువురు స్టార్ హీరోలు పలు ప్రత్యేక పాత్రలలో నటించబోతున్నారట. మమ్ముట్టి, షారుఖ్ ఖాన్ ..ఇలా ప్రతి చిత్రపరిశ్రమ నుండి ఒక్కో క్రేజీ స్టార్ హీరో ఈ సినిమాలో స్పెషల్ రోల్ చెయ్యబోతున్నారని నడుస్తున్న టాక్.. ఆడియన్స్ ఈ సినిమాపట్ల మరింత ఆకర్షితులయ్యేలా చేస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa