శుక్ర, మాటరాని మౌనమిది చిత్రాల దర్శకుడు సుకు పూర్వజ్ తాజాగా రూపొందిస్తున్న చిత్రం "ఏ మాస్టర్ పీస్". సినిమా బండి బ్యానర్ పై కాండ్రగుల శ్రీకాంత్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
తాజాగా ఈ మూవీ మోషన్ పోస్టర్ ను మేకర్స్ విడుదల చెయ్యడం జరిగింది. ఒక సూపర్ హీరో ఎలా అవతరించాడు? ఏం చేసాడు? అనే విషయాలను సైన్టిఫిక్ గా, అడ్వెంచరస్ గా ఈ సినిమాలో చూపించబోతున్నారు. ఇప్పటివరకు ఈ సినిమాలో నటించడానికి అషురెడ్డి, అరవింద్ కృష్ణ, స్నేహ గుప్తా మాత్రమే ఎంపిక చెయ్యబడ్డారని, మిగిలిన నటీనటులకు సంబంధించిన విషయాలను త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని మేకర్స్ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa