టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో నితిన్ గతేడాది "మ్యాస్ట్రో", "మాచర్ల నియోజకవర్గం" బ్యాక్ టు బ్యాక్ రెండు వరస ఫ్లాప్ లను అందుకుని, అభిమానులకు తీవ్ర నిరాశను కలిగించారు. ఐతే, ఈ ఏడాది ఫ్యాన్స్ పండగ చేసుకునే కంటెంట్ తో రాబోతున్నారు నితిన్. ప్రస్తుతం వక్కంతం వంశీ డైరెక్షన్లో నితిన్ ఒక సినిమా షూటింగ్ లో పాల్గొంటూ బిజీగా ఉన్నారు.
తాజాగా నితిన్ తన ట్విట్టర్ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టారు. ఈ పిక్ లో నితిన్ ఆంజనేయ స్వామి మాలధారణలో కనిపిస్తున్నారు. ఈ ఫొటోకు .. శ్రీ ఆంజనేయం.. సర్వదా జయం.. ఎంజాయ్ యువర్ ఆదివారం.. అంటూ నితిన్ ట్వీట్ చేసారు. మరి, నిజంగా నితిన్ ఆంజనేయ మాల ధారణలో ఉన్నారా? లేక షూటింగ్ నిమిత్తమా? అన్నది తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa