ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మాలికాపురం : ఆకట్టుకుంటున్న 'గణపతి అనుమతితో' వీడియో సాంగ్

cinema |  Suryaa Desk  | Published : Sat, Jan 21, 2023, 01:05 PM

ఈ నెల 26వ తేదీన విడుదల కాబోతున్న మలయాళ అనువాద చిత్రం "మాలికాపురం". అయ్యప్ప స్వామి కథా నేపథ్యంలో చిన్న పిల్లలు లీడ్ రోల్స్ లో నటించిన ఈ సినిమాలో ఉన్ని ముకుందన్ స్పెషల్ రోల్ లో నటించారు. విష్ణు శశి శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా రీసెంట్గానే మలయాళంలో విడుదలై ఘనవిజయం సాధించింది.


తాజాగా మాలికాపురం సినిమా నుండి 'గణపతి అనుమతితో' అనే వీడియో సాంగ్ విడుదలైంది. స్వాములందరూ కలిసి అయ్యప్పను స్మరిస్తూ, ధ్యానిస్తూ పాడుకునే ఈ పాట ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ పాటను వినాయక్ , సాయిచరణ్ ఆలపించగా, సామ్రాట్ లిరిక్స్ అందించారు. రంజన్ రాజ్ స్వరపరిచారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa