టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారు గతేడాది కాంతార, భేడియా అనువాద చిత్రాలను తెలుగులో విడుదల చేసిన విషయం తెలిసిందే. వీటిలో భేడియా ఓ మోస్తరు కలెక్షన్లను రాబట్టగా, కన్నడ బ్లాక్ బస్టర్ కాంతార మాత్రం అల్లు అరవింద్ చేతి నిండా లాభాలను తీసుకొచ్చింది.
తాజాగా ఈ ఏడాది మరొక అనువాద చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసేందుకు అల్లు అరవింద్ గారు సిద్ధమయ్యారు. 'మాలికాపురం' అనే డివోషనల్ సినిమా రీసెంట్గానే మలయాళంలో విడుదలై, మంచి ఆదరణ దక్కించుకుంది. ఇప్పుడు ఈ సినిమాను అల్లు అరవింద్ గారి గీతా ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ సంస్థ తెలుగులో ఈ నెల 26న విడుదల చెయ్యడానికి రెడీ అయ్యింది. ఈ మేరకు నిన్ననే ట్రైలర్ ను కూడా విడుదల చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa