యంగ్ హీరో హీరోయిన్లు నిఖిల్ సిద్దార్థ్, అనుపమ పరమేశ్వరన్ నటించిన క్రేజీ లవ్ స్టోరీ "18 పేజెస్". డిసెంబర్ 23న విడుదలైన ఈ మూవీకి ఆడియన్స్ నుండి సూపర్ పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా క్రేజీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
తాజా అధికారిక సమాచారం ప్రకారం, 18 పేజెస్ మూవీ ఈ నెల 27 నుండి నెట్ ఫ్లిక్స్ మరియు ఆహా ఓటిటీలలో స్ట్రీమింగ్ కు రాబోతుందని తెలుస్తుంది. థియేటర్ ఆడియన్స్ ను విపరీతంగా అలరించిన 18 పేజెస్ డిజిటల్ ఆడియన్స్ ను ఏమేరకు మెప్పించగలదో చూడాలి.
పల్నాటి సూర్యప్రతాప్ డైరెక్షన్లో విభిన్నప్రేమకథగా రూపొందిన ఈ సినిమాను గీతా ఆర్ట్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు నిర్మించాయి. గోపిసుందర్ సంగీతం అందించారు. సుకుమార్ ఈ సినిమాకు కథను అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa