భారతదేశంలోని ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్‌లలో ZEE5 ఒకటి. ఈ పాపులర్ OTT ప్లాట్ఫారం ఇప్పుడు 'ATM' అనే టైటిల్ తో వెబ్ సిరీస్ ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్ లో బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 టైటిల్ విజేత VJ సన్నీ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.
తాజాగా ఇప్పుడు ఈ సిరీస్ తెలుగు, తమిళం రెండు భాషల్లోనూ జనవరి 20, 2023న డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానుంది. చంద్ర మోహన్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో సుబ్బరాజు, రోయల్ శ్రీ, రవిరాజ్, కృష్ణ బురుగుల తదితరులు కీలక పాత్రలు పోషించారు.
హైదరాబాద్‌లోని మురికివాడలకు చెందిన నలుగురు యువకుల కథే 'ATM'. ప్రశాంత్ ఆర్ విహారి ఈ సిరీస్ కి సంగీతం అందించారు. దిల్ రాజు నిర్మాణంలో శిరీష్ మరియు హరీష్ శంకర్ సమర్పణలో హర్షిత్ రెడ్డి మరియు హన్షిత ఈ వెబ్ సిరీస్ ని నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa