ప్రముఖ కమెడియన్ వడివేలు ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి సరోజిని(87) అనారోగ్యంతో మృతిచెందారు. మధురై సమీపంలోని తమ స్వగ్రామం విరగనూర్ లో నివసిస్తున్న ఆమె కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో మధురైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న రాత్రి కన్నుమూశారు. నేడు సాయంత్రం స్వగ్రామంలో ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి.
వడివేలు తల్లి చనిపోయారన్న విషయం తెలియగానే తమిళనాడులో పలువురు నటీనటులు తమ సంతాపం తెలియజేస్తున్నారు. ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ.. కొంత మంది వడివేలుకు ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. మరికొంత మంది సోషల్ మీడియాలో పోస్టుల ద్వారా తమ సంతాపంప్రకటిస్తున్నారు. అయితే వడివేలు మాతృమూర్తి అంత్యక్రియటు నేటి సాయంత్ర జరగనున్నట్టు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి కొంత మంది కోలీవుడ్ నుటు హాజరు కానున్నారనని సమాచారం.