ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రియాంకాచోప్రాకు కృతజ్ఞతలు తెలిపిన రాజమౌళి..!!

cinema |  Suryaa Desk  | Published : Wed, Jan 18, 2023, 04:57 PM

దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన RRR గ్లోబల్ లెవెల్లో చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. ఇప్పటికే పలు ఇంటర్నేషనల్ అవార్డులను అందుకున్న RRR ప్రఖ్యాత గోల్డెన్ గ్లోబ్ అవార్డును అందుకుని తన ఖ్యాతిని పెంచుకుంది. ఇక, ప్రస్తుతం ఈ సినిమా ఆస్కార్ నామినేషన్స్ లో కూడా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వెస్ట్రన్ దేశాల్లో రాజమౌళి, కీరవాణి ముమ్మర ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తూ బిజీగా ఉన్నారు.


ఈ సందర్భంగా లాస్ ఏంజెల్స్ లో RRR స్పెషల్ స్క్రీనింగ్ జరిగింది. ఈ స్క్రీనింగ్ లో ప్రముఖ బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా కూడా పాల్గొన్నారు. అంతేకాక RRR సినిమా గురించి, రాజమౌళి గురించి పొగుడుతూ మంచి స్పీచ్ కూడా ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రియాంక రాజమౌళి, కీరవాణిలతో దిగిన పిక్ ను సోషల్ మీడియాలో షేర్ చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలియచేసింది. ప్రియాంక పోస్ట్ కు రాజమౌళి స్పందిస్తూ తమ షోను హోస్ట్ చేసినందుకు ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రియాంకను రాజమౌళి గ్లోబల్ సూపర్ ఉమెన్ అని పేర్కొన్నారు.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa