పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వినోదాత్మక చిత్రాల దర్శకుడు మారుతీ తో ఒక సినిమాను చేస్తున్నారు. ఇందులో మాళవికా మోహనన్ హీరోయిన్ గా నటిస్తుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తుంది.
తాజాగా అందుతున్న సమాచారం మేరకు, మేకర్స్ ఈ సినిమాను దసరా కానుకగా విడుదల చెయ్యాలని షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే కొంతమేర షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 27న న్యూ షెడ్యూల్ ను స్టార్ట్ చెయ్యనుంది. ఆపై ఫిబ్రవరి మూడో వారంలో మరొక న్యూ షెడ్యూల్ ను జరుపుకోనుంది.
ఒకవేళ ఈ సినిమా దసరాకే విడుదలైతే కనక, ప్రభాస్ నటించిన మూడు సినిమాలు ఆదిపురుష్, మారుతి సినిమా, సలార్ నెలల వ్యవధిలోనే విడుదలబోతున్నాయని తెలుస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa