యంగ్ అండ్ డైనమిక్ హీరో వరుణ్ తేజ్, PSV గరుడవేగ ఫేమ్ ప్రవీణ్ సత్తారు డైరెక్షన్లో ఒక సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. లండన్ లో కొన్నాళ్ల నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా యొక్క టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ ను విడుదల చేసేందుకు మేకర్స్ ముహూర్తం ఖరారు చేసారు. ఈ మేరకు రేపు ఉదయం పదకొండు గంటలకు వరుణ్ తేజ్ కెరీర్ లో 12వ సినిమాగా తెరకెక్కుతున్న VT 12 టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ విడుదల కాబోతున్నట్టు మేకర్స్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు.
ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తుండగా, BVSN ప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa