ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యూట్యూబ్ ట్రెండింగ్లో గెటప్ శ్రీను "రాజు యాదవ్" టీజర్

cinema |  Suryaa Desk  | Published : Mon, Jan 16, 2023, 05:03 PM

బుల్లితెర హాస్యనటుడు గెటప్ శ్రీను ప్రధానపాత్రలో నటిస్తున్న చిత్రం "రాజు యాదవ్". రీసెంట్గా విడుదలైన రాజు యాదవ్ టీజర్ ఆడియన్స్ నుండి అమేజింగ్ రెస్పాన్స్ అందుకుంటుంది. కే కృష్ణమాచారి డైరెక్షన్లో కామెడీ లవ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ మూవీలో గెటప్ శ్రీను ఒక వింత వ్యాధితో బాధపడుతుంటారు. ఒక చిన్న ప్రమాదం కారణంగా గెటప్ శ్రీను ఎప్పుడూ నవ్వుతూనే ఉంటారు. ఈ నవ్వు ఆయన ఫ్యామిలీ, లవ్ లో ఎలాంటి మార్పులు తీసుకొచ్చింది? చివరికి గెటప్ శ్రీను సాధారణ స్థితికి వచ్చారా? అన్న ఆసక్తికర అంశాలతో రూపొందిన ఈ మూవీ టీజర్ ప్రస్తుతం యూట్యూబ్ #4 ట్రెండింగ్లో దూసుకుపోతుంది. ఇప్పటివరకు ఈ టీజర్ 1.3 మిలియన్ వ్యూస్ మరియు, 64కే లైక్స్ ను రాబట్టింది.


పోతే, ఈ మూవీ మార్చి నెలలో విడుదల కావడానికి రెడీ అవుతుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa