ట్రెండింగ్
Epaper    English    தமிழ்

షారుఖ్ ఖాన్ "పఠాన్" పై లేటెస్ట్ అప్డేట్ ..!!

cinema |  Suryaa Desk  | Published : Mon, Jan 16, 2023, 04:17 PM

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటిస్తున్న న్యూ మూవీ "పఠాన్" ట్రైలర్ రీసెంట్గానే విడుదలై, అన్ని ప్రాంతాల ప్రేక్షకుల చేత వావ్ అనిపించింది. టీజర్, ట్రైలర్ తో భారీ అంచనాలు ఈ సినిమాపై నెలకొన్నప్పటికీ, మరోపక్క బాయ్ కాట్ పఠాన్ నినాదాలు కూడా జోరుగా వినిపిస్తున్నాయి.


ఈ నెల 26న హిందీ, తెలుగు, తమిళ భాషలలో విడుదల కావడానికి రెడీ అవుతున్న ఈ సినిమా యొక్క ట్రైలర్ ను తాజాగా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బిల్డింగ్ బుర్జ్ ఖలీఫా మీద స్క్రీన్ చెయ్యడం జరిగింది.


దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో జాన్ అబ్రహం కీరోల్ లో నటిస్తున్నారు. సిద్దార్థ్ ఆనంద్ డైరెక్షన్లో స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని యష్ రాజ్ స్టూడియోస్ సంస్థ నిర్మించింది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa