గతేడాది 'సర్దార్' సినిమాతో బ్లాక్ బస్టర్ విజయం సాధించిన కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ ఈ ఏడాది 'జపాన్' బహుభాషా చిత్రంతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.
తాజాగా ప్రేక్షకులందరికీ పొంగల్ శుభాకాంక్షలు తెలుపుతూ మేకర్స్ ఈ సినిమా నుండి న్యూ పోస్టర్ ను విడుదల చేసారు. ఈ పోస్టర్ లో కార్తీ బాగా దట్టమైన రింగులు తిరిగిన జుట్టుతో, ఇంటెన్స్ లుక్ లో కనిపిస్తున్నారు.
ఈ ప్రాజెక్ట్ ను రాజు మురుగన్ డైరెక్ట్ చేస్తుండగా, అను ఇమ్మానుయేల్ హీరోయిన్ గా నటిస్తుంది. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa