మెగాస్టార్ చిరంజీవి గారు, మాస్ రాజా రవితేజ గారు కలిసి నటించిన "వాల్తేరు వీరయ్య"కు ఇరు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల నుండి అమేజింగ్ రెస్పాన్స్ వస్తుంది. చిరు వింటేజ్ యాక్షన్ అండ్ స్వాగ్ కి రవితేజ పవర్ఫుల్ మాస్ ఫోర్స్ తోడవ్వడంతో ఈ సినిమా హౌస్ ఫుల్ థియేటర్ రన్ జరుపుకుంటుంది. అలానే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామి సృష్టిస్తుంది.
తాజా అధికారిక సమాచారం మేరకు, మూడ్రోజుల్లో వాల్తేరు వీరయ్య ప్రపంచవ్యాప్తంగా 108కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టిందని తెలుస్తుంది. ఈ విషయాన్ని పేర్కొంటూ మేకర్స్ అఫీషియల్ పోస్టర్ ను కూడా విడుదల చేసారు.
సంక్రాంతి పండగ వాల్తేరు వీరయ్య సక్సెస్ కు బాగా కలిసొచ్చిన అంశం. మరి, ఫుల్ రన్ లో కలెక్షన్లు ఎలా ఉంటాయో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa