పవన్ కళ్యాణ్ సినిమాలో ఒక్కసారైనా నటించాలని చాలా మంది నటీనటులు కోరుకుంటారు. కానీ ప్రియాంక జవాల్కర్ మాత్రం ఆయన సినిమాలో ఛాన్స్ వస్తే చేయనని అంటోంది. తనకు పవన్ కల్యాణ్ అంటే పిచ్చి అని, తమ్ముడు సినిమాను 20 సార్లు చూశానని చెప్పింది. పవన్ కు తాను అభిమానినని, ఆయనని దూరం నుంచి చూస్తూ, అభిమానిస్తూ ఉండిపోతానని తెలిపింది. అంతకుమించి ఏం కోరుకోవడం లేదని, ఆయనతో నటించే ఛాన్స్ వచ్చినా చేయనని తెలిపింది.