క్రేజీ హీరోయిన్ సమంత నుండి గతేడాది కణ్మణి రాంబో ఖతీజా, యశోద సినిమాలు విడుదలవ్వగా, అందులో యశోద మూవీ పాన్ ఇండియా సూపర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ ఏడాది కూడా సమంత 'శాకుంతలం' పాన్ ఇండియా సినిమాతో మరొకసారి ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతుంది.
ఈ నేపథ్యంలో తాజాగా విడుదలైన ఆర్మాక్స్ టాప్ 10 టాలీవుడ్ మోస్ట్ పాపులర్ హీరోయిన్స్ జాబితాలో సమంత టాప్ ప్లేస్ ను కైవసం చేసుకుంది. దీంతో ఈ 35ఏళ్ళ సీనియర్ బ్యూటీకి టాలీవుడ్ లో ఎదురేలేదని తెలుస్తుంది. ఆ తరవాతి స్థానాలలో కాజల్ అగర్వాల్, సాయి పల్లవి, అనుష్క శెట్టి, రష్మిక మందన్నా, తమన్నా, పూజా హెగ్డే, కీర్తి సురేష్, అనుపమ పరమేశ్వరన్ ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa