నాచురల్ స్టార్ నాని 'దసరా' సినిమాతో పాన్ ఇండియా బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేస్తున్నారు. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.
ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యిందని నిన్ననే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వచ్చింది. ఈ నేపథ్యంలో నాని దసరా సినిమాను ఒక వజ్రం తో పోలుస్తూ చేసిన ట్వీట్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. దసరా అనే ఎపిక్ మూవీ షూటింగ్ పూర్తయ్యింది.. ఈ వజ్రం ఎప్పటికీ మెరుస్తూనే ఉంటుంది.. అని ట్వీట్ చేసారు. ఈ ట్వీట్ తో దసరా మూవీ నాని హృదయంలో ఎంత పదిలమైన స్థానం సంపాదించుకుందో తెలుస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa