మెగాపవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్లో "RC 15" సినిమాను చేస్తున్నారు. ఈ సినిమా పూర్తైన వెంటనే ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానతో చరణ్ ఒక పాన్ ఇండియా మూవీ ని చేస్తారు. RC 15 తదుపరి చరణ్ నుండి ఈ సినిమానే అధికారికంగా ఎనౌన్స్ చెయ్యబడింది. ఇంకా మరెందరో డైరెక్టర్లు చరణ్ లిస్టులో ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. వారిలో కన్నడ డైరెక్టర్ నార్తన్, సుకుమార్, లోకేష్ కనగరాజ్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో చరణ్ తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి ఒక హాలీవుడ్ మీడియా పర్సన్ కి తెలుపుతున్న వీడియో ఒకటి నెట్టింట హల్చల్ చేస్తుంది. ఈ వీడియోలో చరణ్ మాట్లాడుతూ.. 2023లో మూడు సినిమాలు, 2024లో మరో మూడు సినిమాలు తన నుండి వస్తాయని చెప్పారు. ఐతే, వీటిలో కొన్ని చర్చలో దశలో ఉన్నాయని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa