టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో అడివిశేష్ తన బ్లాక్ బస్టర్ గూఢచారి చిత్రానికి సీక్వెల్ తీసుకురాబోతున్న విషయం తెలిసిందే కదా. 'G 2' టైటిల్ తో న్యూ ఇయర్ రోజున ఎనౌన్స్ చెయ్యబడిన ఈ సినిమా ఇటీవలే ముంబై, హైదరాబాద్ లలో గ్రాండ్ ప్రీ విజన్ లాంచ్ ఈవెంట్లను జరుపుకుంది. G 2 ప్రీ విజన్ వీడియోకు ఆడియన్స్ నుండి అమేజింగ్ రెస్పాన్స్ వస్తుంది. సుమారు 10మిలియన్ కు పైగా ప్రేక్షకాభిమానులు జి 2 ప్రీ విజన్ వీడియోను చూసి సినిమా అతి త్వరలోనే విడుదల కావాలని కోరుకుంటున్నారు.
అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, AK ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమాను వినయ్ కుమార్ సిరిగినీడి డైరెక్ట్ చేస్తున్నారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa