నటసింహం నందమూరి బాలకృష్ణ గారు నటించిన కొత్త సినిమా "వీరసింహారెడ్డి" ఈ రోజే ప్రపంచవ్యాప్తంగా విడుదల కాగా, చూసిన ప్రతి ఒక్కరి నుండి పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. తొలి రోజు కాబట్టి థియేటర్లన్నీ బాలయ్య అభిమానులతో నిండిపోయాయి. థియేటర్లన్నీ జై బాలయ్య నినాదాలతో మారు మోగుతుండగా, థియేటర్లు పేపర్ ముక్కలతో నిండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఓవర్సీస్ లో ఒక చోట వీరసింహారెడ్డి షోను మధ్యలోనే ఆపేసారు. ప్రేక్షకులను బయటకు వెళ్లిపోవలసిందిగా ధియేటర్ యాజమాన్యం కోరుతున్న వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. పేపర్ ముక్కలను థియేటర్లో చిమ్మెయ్యడం వల్లనే యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa