నటసింహం నందమూరి బాలకృష్ణ గారు నటించిన న్యూ మూవీ "వీరసింహారెడ్డి" ఈ రోజే ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాగా, ఎర్లీ మార్నింగ్ షోస్, ప్రీమియర్స్ నుండి పాజిటివ్ రిపోర్ట్స్ వస్తున్నాయి.
ఈ సినిమాకు తెలంగాణా ప్రభుత్వం ఆరవ షోకు అనుమతినిచ్చిన విషయం తెలిసిందే కదా. ఈ నేపథ్యంలో ఈ రోజు తెల్లవారుఝామున నాలుగు గంటలకు హైదరాబాద్ లోని భ్రమరాంబ థియేటర్ లో వీరసింహారెడ్డి తొలి షో పడింది. ఈ షోకు బాలయ్య, దర్శకుడు గోపీచంద్ మలినేని తో కలిసి వచ్చారు. అభిమానులతో కలిసి, వారి కోలాహలం మధ్యన సినిమాను చూసారు. దీంతో భ్రమరాంబ ధియేటర్ వద్ద పండగ వాతావరణం నెలకొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa