నటసింహం నందమూరి బాలకృష్ణ గారు నటించిన కొత్త చిత్రం "వీరసింహారెడ్డి" ప్రపంచవ్యాప్తంగా రేపే థియేటర్లకు రాబోతుంది. ఈ నేపథ్యంలో మరికాసేపట్లోనే అంటే ఈరోజు రాత్రి రెండు గంటలకు USA ప్రీమియర్స్ మొదలు కాబోతున్నాయి.
గోపీచంద్ మలినేని డైరెక్షన్లో మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్, హనీ రోజ్, దునియా విజయ్ కీరోల్స్ లో నటించారు. ఇప్పటివరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ లిరికల్ సాంగ్స్, ట్రైలర్ సినిమాపై భీకర అంచనాలను ఏర్పరిచాయి.
ఈ నేపథ్యంలో రేపు థియేటర్లకు రాబోతున్న వీరసింహారెడ్డి వెండితెరపై అద్భుతం చేసి, బాక్సాఫీస్ ను రూల్ చెయ్యాలని అభిమానులు కోరుకుంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa