ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అన్స్టాపబుల్ లేటెస్ట్ : వందకోట్ల హీరోకి బాలయ్య ఫోన్ కాల్..!!

cinema |  Suryaa Desk  | Published : Wed, Jan 11, 2023, 06:11 PM

ఆహా సంస్థలో దిగ్విజయంగా కొనసాగుతున్న "అన్స్టాపబుల్ విత్ NBK" సీజన్ 2 టాక్ షో ను నటసింహం నందమూరి బాలకృష్ణ గారు హోస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ షో లేటెస్ట్ ఎపిసోడ్ కు బాలయ్య కొత్త మూవీ "వీరసింహారెడ్డి" చిత్రబృందం హాజరుకానున్నారు. ఈనేపధ్యంలో కాసేపటి క్రితమే ఈ ఎపిసోడ్ ప్రోమోను ఆహా విడుదల చేసింది.


ఫన్నీ గా మొదలై, కాస్త ఎమోషనల్ టర్న్ తీసుకుని, ఫైనల్గా ఎంటర్టైనింగ్ గా ముగిసిన ఈ ప్రోమోలో బాలయ్య ఒక స్టార్ హీరోతో ఫోన్ కాల్ మాట్లాడతారు. ఆయనెవరో కాదు.. 'ధమాకా' సినిమాతో వంద కోట్ల క్లబ్ లోకి చేరిన మాస్ రాజా రవితేజ. ఈ సందర్భంగా రవితేజతో మాట్లాడుతూ బాలయ్య... వందకోట్ల హీరోకి కంగ్రాట్యులేషన్స్ అని అంటారు.. అప్పుడు వెంటనే రవితేజ ...థాంక్యూ తమ్ముడు ..అని అంటారు.. ఈ ప్రోమోలో ఈ చిన్న పార్ట్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa