ఈ రోజు ఉదయం విడుదలైన వాల్తేరు వీరయ్య సినిమాలోని 'నీకేమో అందమెక్కువ నాకేమో తొందరెక్కువ' పాట పెప్పి ట్యూన్ తో శ్రోతలను ఇట్టే ఆకర్షిస్తుంది. దీంతో ఈ పాట ఇప్పటికే 2 మిలియన్ వ్యూస్ ని రాబట్టేసింది. DSP రాకింగ్ మ్యూజిక్, రామజోగయ్యశాస్త్రి లిరిక్స్, మీకా సింగ్, గీతామాధురిల గానం, చిరు, శృతిల మెస్మరైజింగ్ స్క్రీన్ ప్రెజెన్స్ తో ఈ పాట ఇన్స్టంట్ చార్ట్ బస్టర్ గా నిలిచింది.
బాబీ డైరెక్షన్లో మాస్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో మాస్ రాజా రవితేజ కీరోల్ లో నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa