బాలీవుడ్ లో రీమేక్ అవుతున్న టాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీలలో "అల వైకుంఠపురంలో" ఒకటి. "షెహజాదా" టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాను రోహిత్ ధావన్ డైరెక్ట్ చేస్తున్నారు. బాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్ కార్తీక్ ఆర్యన్ అల్లు అర్జున్ రోల్ లో నటిస్తుండగా, బుట్టబొమ్మగా కృతిసనన్ నటిస్తుంది.
ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్ కు ఆడియన్స్ నుండి చాలా మంచి స్పందన వస్తుండగా, రేపు ఈ మూవీ ట్రైలర్ ను విడుదల చేసేందుకు మేకర్స్ ముహూర్తం ఫిక్స్ చేసారు. ఈ మేరకు అఫీషియల్ పోస్టర్ కూడా విడుదల చేసారు.
పోతే, ఫిబ్రవరి 10వ తేదీన షెహజాదా మూవీ థియేటర్లకు రాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa