మెగాపవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం లాస్ ఏంజెల్స్ లో జరుగుతున్న 80వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల కార్యక్రమంలో పాల్గొంటున్న విషయం తెలిసిందే కదా. ఈ రోజు ఉదయమే RRR లోని నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ గా అవార్డు దక్కింది.
ఈ నేపథ్యంలో రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్ అక్కడి లోకల్ మీడియాతో ముచ్చటించారు. వారు చరణ్, తారక్ లను మార్వెల్ సూపర్ హీరోలలో ఏ హీరో పాత్రలో నటించాలనుందని అడగ్గా అందుకు ఇద్దరూ కూడా ఐతే ఐరన్ మాన్ లేకుంటే కెప్టెన్ అమెరికా అని బదులివ్వడం విశేషం. ఈ సందర్భంగా చరణ్ మాట్లాడుతూ.. ఇండియాలో ఇలాంటి ఎందరో సూపర్ హీరోలున్నారని, వారందరిపై సినిమాలు తీస్తే ఇంకా బాగుంటుంది.. అని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa