తలపతి విజయ్ అభిమానులు ఎన్నోరోజుల నుండి ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చేసింది. వంశీ పైడిపల్లి డైరెక్షన్లో తలపతి విజయ్ హీరోగా నటించిన "వారిసు" ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ప్రీమియర్స్, ఎర్లీ షోస్ నుండి ఈ సినిమాకు పాజిటివ్ రిపోర్ట్స్ వస్తున్నాయి.
తాజా సమాచారం ప్రకారం, వారిసు మూవీ తన డిజిటల్ స్ట్రీమింగ్ పార్టనర్ గా ప్రఖ్యాత అమెజాన్ ప్రైమ్ వీడియోను ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తుంది. వారిసు మేకర్స్ కి సాలిడ్ ఏమాంట్ చెల్లించి ప్రైమ్ వీడియో ఈ మూవీ హక్కులను చేజిక్కించుకుందంట.
రష్మిక మండన్నా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు థమన్ సంగీతం అందించారు. దిల్ రాజు నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa