టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాగా విడుదలై, సంచలన విజయం సాధించిన సినిమాలలో "RX 100" ఒకటి. కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ జంటగా కొత్తదర్శకుడు అజయ్ భూపతి రూపొందించిన ఈ రొమాంటిక్ థ్రిల్లర్ ప్రేక్షకుల నుండి మంచి రివ్యూలను అందుకుంది.
RX 100 బ్లాక్ బస్టర్ తో కార్తికేయ, పాయల్ వరసపెట్టి సినిమాలను చేస్తున్నారు. కానీ, డైరెక్టర్ అజయ్ భూపతి మాత్రం ఆ సినిమా తదుపరి మహాసముద్రం సినిమా చేసి, చెయ్యి కాల్చుకుని ఒక సూపర్ హిట్ తో గ్రాండ్ కమ్ బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు.
ఈ నేపథ్యంలో తనకు ఫస్ట్ సూపర్ హిట్ అందించిన కార్తికేయతోనే అజయ్ తన నెక్స్ట్ మూవీని చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారట. ఇదొక తెలుగు - తమిళ ద్విభాషా చిత్రంగా తెరకెక్కబోతుందట. మరైతే, ఈ వార్తపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa