గతేడాది "ఎఫ్ 3"తో ప్రేక్షకులను పలకరించి, సూపర్ హిట్ అందుకున్న టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్ గారు ఆపై నెక్స్ట్ మూవీని ఎనౌన్స్ చెయ్యలేదు. ఈ నేపథ్యంలో వెంకటేష్ నెక్స్ట్ మూవీపై పలురకాల ఆసక్తికరమైన వార్తలు మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
వెంకటేష్ తదుపరి చిత్రానికి ,'హిట్' ఫ్రాంచైజీని సక్సెస్ఫుల్ గా తెరకెక్కించిన శైలేష్ కొలను డైరెక్టర్ గా వ్యవహరిస్తారని, నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఈ సినిమా నిర్మాణం జరుగుతుందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. మరొక సర్ప్రైజింగ్ న్యూస్ ఏంటంటే, ఈ సినిమాలో వెంకటేష్ కు జోడిగా KGF బ్యూటీ శ్రీనిధి శెట్టి నటించబోతుందంట.
ఈ ప్రాజెక్ట్ వెంకటేష్ కెరీర్ లో మైల్ స్టోన్ అయినటువంటి 75వ సినిమాగా రాబోతుంది కాబట్టి, ఈ ప్రెస్టీజియస్ మూవీకి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ ను మంచి అకేషన్ చూసుకుని ప్రకటించాలని చూస్తున్నారట.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa